అందమైన కాకినాడ పట్టణానికి స్వాగతం.

Monday, July 27, 2015

ఆంధ్ర,తెలంగాణ విడిపోయిన తరువాత కాకినాడ ఒక ప్రత్యేక నగరంగా రూపుదిద్దుకుంటోంది. ఎందుకంటే సముద్రపు తీరప్రాంతాన ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయితే జిల్లాకి ఒక మూలన ఉండి జిల్లా కార్యకాలాపాలన్నీ నిర్వహిస్తోంది. ఈమధ్యకాలంలో అయితే కాకినాడ మెయిన్ రోడ్డు ఎంతో సర్వాంగ సుందరంగా తయారయ్యి కనులకు వినసోంపుగా మారింది. తూర్పుగోదావరి జిల్లాకి ఒక చివర రాజమండ్రి, మరొక చివర కాకినాడ తలమానికంగా నిలిచాయి. మరొక గొప్ప చిత్రమేమిటంటే రాజమండ్రికి గోదావరి నది ఎండింగ్ అయితే కాకినాడకి సముద్రం చివరి సరిహద్దు. తూర్పు గోదావరికి సముద్రపు హోరులు, గోదారి గలగలలు నిత్యం మనస్సుకు వినసొంపును అందిస్తూనే ఉంటాయి.. అటువంటి మహత్తర జిల్లాకి కాకినాడ ఒక కిరీటము. మరి ఇటువంటి కాకినాడ గురించి ప్రతీవక్కరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఉద్దేశ్యంతో కాకినాడకి సంబంధించిన ప్రతి సమాచారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ బ్లాగును స్థాపించాను. దీనిలో కాకినాడకు సంబంధించిన వార్తలతో పాటు, వ్యాపార సంస్థలను, కాలేజీలను ,గుడులు,మాజీదులు,చర్చీలతో పాటు సినిమా ధియేటర్ల సమాచారం కూడా అందించే ప్రయత్నం చేస్తాను. దానితోపాటు మీకు కావల్సిన ప్రతి సమాచారాన్ని మీముందు ఉంచడమే కాకుండా వాటితో మీకు కనెక్ట్ అయ్యే అవకాశం కలిగిస్తాను. మీకు కావల్సిన వస్తువుల గురించిగాని, ఏ విషయమైనా ఫోన్ ద్వారా గాని, మెయిల్ ద్వారా గాని అడిగి తెలుసుకోవచ్చు. సరాసరి ఇంటివద్దనే మీకు కావల్సిన వస్తువును పొందనూ వచ్చు. ఏ సమాచారమైనా ఈ బ్లాగుద్వారా చిటికలో పొందే ఏర్పాటు చేస్తాను.శుభం.
 

Recent Posts

Popular Posts

Ad

Followers

Live Visitors